కథాశిల్పం-1

కథలు ఎలా రాయాలో పుస్తకాలు ఎందుకు రాయకూడదో మూడు కారణాలు చెప్తే, ఎందుకు రాయొచ్చో నాలుగు కారణాలు చెప్పవచ్చు.

కొన్ని కలలు, కొన్ని మెలకువలు

1987 లో గిరిజనసంక్షేమ శాఖలో చేరిన తర్వాత మొదటి పదేళ్ళ కాలంలో విజయనగరం, విశాఖపట్టణం, కర్నూలు, అదిలాబాదు జిల్లాల్లో గిరిజన విద్యను బలోపేతం చేయడానికి వాడ్రేవు చినవీరభద్రుడు చేసిన ప్రయత్నాలూ, ఆ క్రమంలో ఎదురైన సాఫల్య, వైఫల్యాల అనుభవకథనం 'కొన్ని కలలు,కొన్ని మెలకువలు' (2005).

గూగి వా థియోంగో

గూగి వా థియోంగో (1938) కెన్యాకి చెందిన రచయిత. సమకాలిక ఆఫ్రికన్ రచయితల్లో అగ్రశ్రేణికి చెందినవాడు. కథ,నవల, నాటకం వంటి ప్రధాన ప్రక్రియల్లో చెప్పుకోదగ్గ రచనలు వెలువరించాడు. ముఖ్యంగా ఆఫ్రికన్ తెగల్లో ఒకటైన గికుయు తెగ వారి భాషలో ప్రస్తుతం రచనలు చేస్తున్నాడు.

బెన్ ఒక్రి

పాశ్చాత్య రచయితల్ని, ముఖ్యంగా ఐరోపా రచయితల్ని చదువుతుంటే, ఒక సెమినార్ హాల్లో ఒక మేధావితోనో, తాత్త్వికుడితోనో గంభీరమైన విషయాల గురించి మాట్లాడుకున్నట్టు ఉంటుంది. కాని ఆఫ్రికా రచయితల్ని చదివినప్పటి అనుభవం వేరు. వాళ్ళు పూర్వపు రచయితలైనా, ఇప్పటి రచయితలైనా కూడా, వాళ్ళని చదువుతుంటే, మన గ్రామాలకి వెళ్ళి, అక్కడి మట్టి అరుగులమీద కూచుని, ఆ గ్రామ వృద్ధులో, రైతులో, లేదా అక్కడి ముంగిళ్ళలో గృహిణులో చెప్పే సుద్దులు విన్నట్టుంటుంది.

బొంబోల్

చినుకు ఏప్రిల్ సంచికలో మేరీ లూయీ బొంబోల్ రాసిన కథకి పి.సత్యవతి గారు చేసిన అనువాదం 'చెట్టు ' పేరిట వచ్చింది, చదివారా?

నికనర్ పారా

ప్రసిద్ధ చిలీ కవి/వికట కవి నికనర్ పారా మంగళవారం ఈలోకాన్ని భౌతికంగా వీడిపోయాడన్న వార్త నిన్న ఎం.ఎస్.నాయుడు వాల్ మీద చూసాను. పారా ఇంతకాలం బతికున్నాడని ఇప్పుడీ మరణవార్త చూసాకనే తెలియడంలో కూడా ఒక ఐరనీ ఉందనిపించింది.

జోర్జ్ లూయీ బోర్హెస్

జోర్జ్ లూయీ బోర్హెస్ (1899-1986) అర్జెంటీనాకు చెందిన కవి, కథకుడు, ఆలోచనాపరుడు, విమర్శకుడు. మాజికల్ రియలిజంగా ప్రసిద్ధి చెందిన విశిష్ట కథన ప్రక్రియకి ఆద్యుడు. 20 వ శతాబ్ది పూర్వార్థంలో ఇలియట్, జాయిస్, పౌండ్, కాఫ్కా,మార్సెల్ ప్రూ వంటి రచయితలు ప్రపంచసాహిత్యాన్ని గాఢంగా ప్రభావితం చేసారు.

బోర్హెస్ సంభాషణలు

ఒక్క మాటలో చెప్పాలంటే, బోర్హెస్ ఒక మిస్టిక్, కానీ ఆధునిక rational ప్రపంచం మాత్రమే సృష్టించగల మిస్టిక్. ఆ మిస్టికానుభవం ఎలాంటిదో తెలుసుకోడానికి బోర్హెస్ కథలు చదవాలి, పుస్తక సమీక్షలు చదవాలి, ఇదిగో, ఈ సంభాషణలు చదవాలి.

ఆక్టేవియో పాజ్

వెనకటికి తమిళదేశంలో శాత్తనార్ అనే కవి ఉండేవాడట. మణిమేఖలై మహాకావ్య కర్త. అతడు చెడ్డ కవిత్వం వినవలసి వచ్చినప్పుడల్లా తలబాదుకునేవాడట. అట్లా బాదుకుని బాదుకునీ ఆ తల పుండైపోయిందట. శీత్తలై (చీముతల) శాత్తనార్ అంటే తలపుండైపోయినవాడు అని అర్థం.

బ్రెజిల్ కవులు

'కవులన్నా, కవిత్వమన్నా బ్రెజిల్లో గొప్ప గౌరవం.ఆ మనిషి వ్యాపారస్థుడు గానీ,రాజకీయవేత్తగానీ, అసలతడికి కవిత్వంతో ఏ మాత్రం సంబంధం లేకపోయినా,అతణ్ణి ఆదరంగా పలకరించవలసి వచ్చినప్పుడో, లేదా ప్రశంసించవలసి వచ్చినప్పుడో, కవీ అని పిలవడంలో వాళ్ళకో సంతోషం..'